Andhra Pradesh: సీఎం జగన్‌ను విష్ణువుతో పోల్చిన రమణ దీక్షితులు

Andhra Pradesh: టీటీడీ అర్చకులు రమణ దీక్షితులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.

Arun Chilukuri
Published on: 6 April 2021 3:27 PM IST
TTD Ramana Deekshitulu Meets CM YS Jagan
X

Andhra Pradesh: సీఎం జగన్‌ను విష్ణువుతో పోల్చిన రమణ దీక్షితులు

Andhra Pradesh: టీటీడీ అర్చకులు రమణ దీక్షితులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. టీటీడీ వంశపారంపర్య అర్చకుల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. వేల సంవత్సరాల నుంచీ వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతుందన్న రమణ దీక్షితులు ఈ మధ్య దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, ముఖ్యమంత్రి చొరవ తీసుకుని మళ్లీ పునరుద్ధరించారని స్పష్టం చేశారు.

ప్రతి పాలకుడిలో విష్ణు అంశ ఉంటుందన్న రమణ దీక్షితులు సనాతన ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు విష్ణుమూర్తిలా సీఎం జగన్ ధర్మాన్ని పునరుద్ధరించారని కొనియాడారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరామని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడంలేదని, దేవస్థానం విషయాలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story