టీటీడీ వార్షిక బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం..

Tirumala Tirupati Devasthanams: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలకమైన తన వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 4:22 PM IST
TTD Okays Budget of ₹3,096.40 Crore for 2022-23
X

టీటీడీ వార్షిక బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం..

Tirumala Tirupati Devasthanams: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలకమైన తన వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 3,096.40 కోట్ల రూపాయల బడ్జెట్‌ను టీటీడీ పాలకమండలి ఆమోదించింది. తిరుమలలో గత వైభవం మళ్లీ కనిపించేలా రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. త్వరలోనే ఆర్జిత సేవలు ప్రారంభమౌతాయన్నారు.

ఇప్పటి వరకు హృదయాలయంగా ఉన్న శ్రీపద్మావతీ హృదయాలయాన్ని 230 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చేందుకు ఆమోదించారు. అధునాతన చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఉద్యోగుల నగదు రహిత వైద్య సేవల కోసం 25 కోట్లు మంజూరు చేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. ఇంకా అనేక అంశాల్లో పాలనాపరమైన అనుమతులను వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story