TTD Darshan Tickets: ఇవాళ ఆన్‌లైన్‌లో నవంబర్‌ నెల టికెట్లు విడుదల

TTD Darshan Tickets: ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల

Shekhar G
Published on: 22 Aug 2023 8:11 AM IST
TTD November Darshan Tickets Are Released Online Today
X

TTD Tickets: ఇవాళ ఆన్‌లైన్‌లో నవంబర్‌ నెల టికెట్లు విడుదల

TTD Darshan Tickets: ఇవాళ ఆన్‌లైన్‌లో నవంబర్‌ నెల టికెట్లు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ టికెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. 24వ తేదీన ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్, ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

Shekhar G

Shekhar G

Next Story