TTD: వీఐపీ బ్రేక్ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసిన టీటీడీ

TTD: శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు

Jyothi
Updated on: 21 May 2023 10:33 AM IST
TTD Makes Changes in VIP Break Darshan
X

TTD: వీఐపీ బ్రేక్ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసిన టీటీడీ 

TTD: వీఐపీ బ్రేక్ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ దృష్ట్యా జూన్‌ 30 వరకు వీఐపీ రికమండేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా సర్వదర్శనానికి వచ్చే భక్తులు వేచి ఉండకుండా.. మూడు గంటల సమయం ఆదా అవుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుప్పావడ సేవను కూడా ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది.

Jyothi

Jyothi

Next Story