Tirumala News: బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఐవోసీఎల్‌తో ఎంవోయూ

Tirumala News: తిరుమ‌ల‌లోని త‌డిచెత్త ద్వారా బ‌యోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు టీటీడీ, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌‌)తో ఎంవోయూ కుదుర్చుకుంది.

Arun Chilukuri
Published on: 13 Oct 2022 11:32 AM IST
TTD Inks MoU With IOCL for Bio Gas Plant
X

Tirumala News: బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఐవోసీఎల్‌తో ఎంవోయూ

Tirumala News: తిరుమ‌ల‌లోని త‌డిచెత్త ద్వారా బ‌యోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు టీటీడీ, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌‌)తో ఎంవోయూ కుదుర్చుకుంది. తిరుమ‌ల అన్నమ‌య్య భ‌వ‌నంలో ఐవోసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తో టీటీడీ ఎంవోయూ ప‌త్రాల‌ను మార్చుకున్నారు. స్వచ్ఛ తిరుమ‌ల‌లో భాగంగా టీటీడీ బోర్డు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో త‌డిచెత్త ద్వారా బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింది.

ఇందులో భాగంగా టీటీడీ రూ.6 కోట్లు, ఐవోసీఎల్‌ రూ.6 కోట్లు క‌లిసి మొత్తం రూ.12 కోట్లతో తిరుమ‌ల‌లో రెండు ఎక‌రాల విస్తీర్ణంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ప్రతి రోజు 35 ట‌న్నుల వ్యర్థాల‌ను ఇందు కోసం వినియోగిస్తారు. తిరుమ‌ల‌లో రోజుకు 3.5 నుండి 4.5 మెట్రిక్‌ ట‌న్నుల గ్యాస్ అవ‌స‌రం కాగా, ఇందులో 1.6 మెట్రిక్ ట‌న్నుల గ్యాస్ ఈ ప్లాంట్ నుండి ఉత్పత్తి అవుతుంది. దీనిని అన్నప్రసాదాల త‌యారీ కేంద్రంలో వినియోగించాల‌ని నిర్ణయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story