తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు.. ఆ ఒక్కరోజే రూ. 6.31 కోట్లు

*ప్రతినెలా హుండీలో దాదాపు రూ.100 కోట్లకు పైగా కానుకలు

Rama Rao
Published on: 2 Nov 2022 7:06 AM IST
TTD Hundi Collection On October 23 | AP News
X

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు.. ఆ ఒక్కరోజే రూ. 6.31 కోట్లు

TTD Hundi Collection: తిరుమల శ్రీవారికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. ప్రతినెలా హుండీలో దాదాపు రూ.100 కోట్లకు పైగా కానుకలు సమకూరుతున్నాయి. అక్టోబరులో హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు రూ.122.8 కోట్లు సమర్పించుకున్నారు. గత నెలలో 23వ తేదీ ఒక్కరోజే రూ. 6.31 కోట్లు హుండీ కానుకలు లభించాయి. ఇవి తిరుమల చరిత్రలోనే రికార్డు స్థాయి హుండీ ఆదాయం కాగా జులైలో అత్యధికంగా రూ .139.35 కోట్లు రావడం గమనార్హం. కరోనా వ్యాప్తి తగ్గినప్పటి నుంచి భక్తుల సంఖ్య ఎంత భారీగా పెరిగిందో హుండీ కానుకలు కూడా అదే స్థాయిలో భారీగా లభిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story