Tirumala: బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరం చేసిన టీటీడీ

Tirumala: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Sriveni Erugu
Published on: 29 July 2022 7:37 AM IST
TTD has Intensified the Brahmotsava Arrangements
X

Tirumala: బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరం చేసిన టీటీడీ

Tirumala: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6వరకు తిరుమలలో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 10రోజుల పాటు నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సర్వ దర్శనానికి మాత్రం అనుమతి ఉంటుందని తెలిపారు. ఉత్సవాలను తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో బ్రహ్మోత్సవాలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు జరుగుతాయని ఆయన తెలిపారు. గరుడ వాహనం రోజు తిరుమలకు బైకులకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story