TTD: నవమి రోజున దుర్గమ్మకు సారె పంపిన టీటీడీ

TTD: అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన టీటీడీ పాలక మండలి

Sandeep Eggoju
Published on: 14 Oct 2021 5:57 PM IST
TTD Governing Body Offers the Silk Clothes to the Kanaka Durga
X

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ (ఫైల్ ఇమేజ్)

TTD: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. నవమిరోజున దుర్గమ్మకు తిరుమల శ్రీవారు సారె పంపడం ఆనవాయితీ.. అందులో భాగంగానే టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని వారు కోరుకున్నారు. మరోవైపు దసరా సందర్భంగా భవానీలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శన ఏర్పాట్లు చేశారు ఇంద్రకీలాద్రి అధికారులు భవానీ మాల విరమణ, ఇరుముడి వారి గ్రామ ఆలయాల్లోనే సమర్పించాలని అధికారులు కోరారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా భవానీలకు దర్శనం, కేశఖండన, జల్లు స్నానాలకు మాత్రమే అనుమతించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story