TTD: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

TTD: ఎల్లుండితో ముగియనున్న ప్రస్తుత పాలకమండలి గడువు * టీటీడీ ఛైర్మన్‌గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే అవకాశం!

Sandeep Eggoju
Updated on: 19 Jun 2021 12:42 PM IST
TTD Governing Body Meeting Today 19th June 2021
X

టీటీడీ పాలకమండలి సమావేశం (ఫైల్ ఇమేజ్)

TTD: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారది ఫ్లైఓవర్ అలిపిరి వరకు పొడగింపుపై చర్చించనున్నారు. వరాహస్వామి వారి ఆలయంలోని గర్భాలయ ద్వారంకు దాత ఇచ్చిన 180 కేజీల వెండి తాపడం చేయడం. తిరుమలలోని ప్రైవేటు మఠాలకు కేటాయించిన స్థలాలు రెన్యువల్‌కు ఆమోదం తెలపనుంది పాలక మండలి. ఎల్లుండితో ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనుంది. టీటీడీ ఛైర్మన్‌గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story