TTD: తిరుమల భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

TTD: మార్చి 21 నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ

Rama Rao
Updated on: 18 March 2022 5:16 PM IST
TTD Good News for Tirumala Devotees | Telugu Online News
X

తిరుమల భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

TTD: తిరుమల భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 21 నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు చెందిన రూ.300 దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. మార్చి 21న ఏప్రిల్ నెలకు చెందిన టికెట్లు, 22న -మే నెల, 23న -జూన్ నెలకు చెందిన టికెట్లను విడుదల చేయనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30వేల టిక్కెట్లు,గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకు 25వేల టికేటన్లను కేటాయించనున్నారు. ఆఫ్ లైన్‌లో రోజుకు 30వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా టీటీడీ భక్తులకు కేటాయించనుంది.

Rama Rao

Rama Rao

Next Story