శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

Tirumala: నేటి నుంచి ఆఫ్‌ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ.

Sriveni Erugu
Published on: 15 Feb 2022 7:11 AM IST
TTD Good News For Srivari Devotees
X

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

Tirumala: శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు టీటీడీ శుభవార్త చెప్పింది. నేటి నుంచి ఆఫ్‌ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్‌ లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను టీటీడీ నిలిపివేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆఫ్‌లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. రేపటి సర్వదర్శనం కోసం ఇవాళ ఉదయం 9గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం కాంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story