భక్తులకి టీటీడీ శుభవార్త!

భక్తులకి టీటీడీ శుభవార్త!
x
Highlights

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. శ్రీవారి భక్తుల విషయంలో నిబంధనలను టీటీడీ తోలిగించింది. 10 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు, 65 ఏళ్ళు పై బడిన వారికి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టుగా తెలిపింది.

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. శ్రీవారి భక్తుల విషయంలో నిబంధనలను టీటీడీ తోలిగించింది. 10 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు, 65 ఏళ్ళు పై బడిన వారికి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టుగా తెలిపింది. వృద్ధులకి, పిల్లలకు క్యూలైన్ల సౌకర్యం లేదంది. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో శ్రీవారి దర్శనం చేసుకోవాలని పేర్కొంది. భక్తుల మనోభావలు, ఆచారాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న టైంలో శ్రీవారి దర్శనానికి టీటీడీ పలు ఆంక్షలు విధించింది. ప్రస్తుతం దాని ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో అంక్షాలను ఎత్తివేసింది.

అటు తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయగా, అధికార వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే డిసెంబర్ 25,26,27 వ తేదీలకు సంబంధించిన టికెట్లు బుకింగ్ అవగా, మరో లక్ష టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories