Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి మ‌రో అవ‌కాశం

Tirumala: శ్రీవారి ద‌ర్శ‌నం టికెట్లు పొంది క‌రోనా కార‌ణంగా వెంక‌న్న ద‌ర్శ‌నం చేసుకోలేక పోయిన భ‌క్తుల‌కు టీటీడీ మ‌రో అవ‌కాశం క‌ల్పించింది.

Samba Siva Rao
Published on: 6 Jun 2021 10:13 PM IST
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి మ‌రో అవ‌కాశం
X

Tirumala: శ్రీవారి ద‌ర్శ‌నం టికెట్లు పొంది క‌రోనా కార‌ణంగా వెంక‌న్న ద‌ర్శ‌నం చేసుకోలేక పోయిన భ‌క్తుల‌కు టీటీడీ మ‌రో అవ‌కాశం క‌ల్పించింది. తిరుమల శ్రీవారి దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. దీంతో జూన్‌ 30 వరకు ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను పొందిన యాత్రికులు వారి దర్శన తేదీని మార్చుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. టికెట్లు పొంది కరోనా ప్రభావంతో స్వామి దర్శనానికి భక్తులు రాలేకపోతున్నట్టు టీటీడీ గుర్తించింది. ఏడాది సమయంలో ఎప్పుడైనా దర్శన సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అవ‌కాశం భ‌క్తుల‌కు ఒక్కసారి మాత్రమే ఇచ్చింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story