Tirumala: టీటీడీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్.. బ్లాస్ట్‌లో వందల సంఖ్యలో భక్తులు చనిపోతారని బెదిరింపు

TTD: తిరుమల దేవస్థానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 19 Aug 2023 5:13 PM IST
TTD Gets Bomb Threat Call
X

Tirumala: టీటీడీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్.. బ్లాస్ట్‌లో వందల సంఖ్యలో భక్తులు చనిపోతారని బెదిరింపు

TTD: తిరుమల దేవస్థానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. అలిపిరి తనిఖీ కేంద్రంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని ఓ ఆగంతకుడు టీటీడీ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అలిపిరి వద్ద తనిఖీలు చేపట్టింది. అయితే భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడు తమిళనాడుకు చెందిన సేలం అనే వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ ఘటన ఈ నెల 15 ఉదయం 11 గంటల 25 నిమిషాలకు జరిగిందని పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story