Tirumala: తిరుమలలో ఈవో శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు

Tirumala: తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Sept 2024 4:23 PM IST
Tirumala: తిరుమలలో ఈవో శ్యామలరావు   ఆకస్మిక తనిఖీలు
X

Tirumala: తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. తమిళులు అత్యంత పవిత్రంగా శ్రీవారిని ఆరాధించే పెరటాసీ మాసం ప్రారంభం కావడంతో అనూహ్యంగా తమిళ భక్తులు తిరమలకు తలివచ్చారు. శ్రీవారి దర్శన సమయంలో ఆహారం సక్రమంగా అందటం లేదని భక్తులు ఫిర్యాదు చేయడంపై స్పందించిన అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

భక్తులకు సమయానికి ఆహారం, పాలు అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అన్నప్రసాదాలను రుచి,నాణ్యతను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగు ఏర్పాట్లతో ఉండాలని సంభందిత అధికారులను అదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story