Heart Attack: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడి ఆరోగ్యం విషమం.. వచ్చే నెలలో వివాహం..

Heart Attack: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడి ఆరోగ్యం విషమం.. వచ్చే నెలలో వివాహం..

Arun Chilukuri
Updated on: 20 Dec 2022 3:08 PM IST
TTD EO Dharma Reddy Son Chandramouli Hospitalized With Heart Attack
X

Heart Attack: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడి ఆరోగ్యం విషమం.. వచ్చే నెలలో వివాహం..

TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్ర‌మౌళి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ప్రస్తుతం శివకు ఎక్మో యంత్రంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. చంద్రమౌళి (శివ) వయసు 28 సంవత్సరాలు. ఇటీవలే ఆయనకు చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది.

వీరి వివాహం జనవరిలో తిరుమలలో జరగనుంది. చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వివాహ కార్యక్రమం కోసం ముంబై నుంచి శివ చెన్నైకు వచ్చారు. ఈ క్రమంలోనే తన వివాహ ఆహ్వాన పత్రికలు పంచుతుండగా శివకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్నేహితులు ఆయనను కావేరి ఆసుపత్రిలో చేర్చారు. ధర్మారెడ్డితో పాటు శేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కుమారుడి పరిస్థితి చూసి ధర్మారెడ్డి సృహ తప్పి పడిపోయారు. డాక్టర్స్ చికిత్స అందించడంతో మళ్లీ కోలుకున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story