తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం

ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో భేటీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Sept 2024 1:54 PM IST
TTD emergency meeting on Tirumala Laddu dispute
X

తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం

తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. ప్రధాన అర్చకుడు, పండితులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయం సంప్రోక్షణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తిరుమల లడ్డూ కల్తీపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఏపీ సర్కార్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం సీఎం చంద్రబాబుకు తిరుమల లడ్డూ కల్తీపై నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story