Tirupati: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్

Tirupati: తిరుపతి నగరంలో సంచలనం రేపిన హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మితో పాటు మరో నలుగురిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 May 2024 1:36 PM IST
TTD Deputy EE Srilaxmi Arrested For Attempt To Murder Case
X

Tirupati: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్

Tirupati: తిరుపతి నగరంలో సంచలనం రేపిన హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మితో పాటు మరో నలుగురిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలోని ఎన్జీవో కాలనీలో ఈ నెల 25న వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యయత్నం జరిగింది. ఆయన నివాసం ఉన్నచోటే ఇద్దరు దుండ‌గులు ఆయ‌నపై కత్తితో దాడి చేశారు.

ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వెంకట శివారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకట శివారెడ్డి, శ్రీలక్ష్మి కుటుంబాలు ఒకే అపార్టుమెంట్లో ఉంటున్నాయి. అపార్ట్‌మెంట్లో ఎదురెదురు ఫ్లాట్‌లలో నివసిస్తున్నారు. అయితే.. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఒకరిపై ఒకరు కోపం పెంచుకున్నారు.ఈ క్రమంలోనే వెంకట శివారెడ్డిపై శ్రీలక్ష్మి కుటుంబం దాడి చేయించినట్లు విచారణలో తేలింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story