TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TTD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమం

Rama Rao
Updated on: 11 Jan 2022 3:04 PM IST
TTD Cleansing Program on the Occasion of  Vaikuntha Ekadashi | AP News Today
X

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమం

TTD: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. స్వామివారికి ప్రాత:కాల పూజా కైంకర్యాలు, అరగింపులు అనంతరం మూలవిరాట్టును దవళవస్త్రంతో చుట్టిన తరువాత ఆలయం మొత్తాన్ని సిబ్బంది నీటితో శుభ్రం చేసారు.

పసుపు, ఎర్ర చందనం, పచ్చకర్పూరం, శ్రీగంధం తదితర సుగంధద్రవ్యాలతో చేసిన లేహ్యాని ఆలయం గోడలకు లేపనం చేసారు. అనంతరం నీటితో మళ్లీ శుద్ధి చేసి, మూలమూర్తికి చుట్టిన వస్త్రాని తొలిగించి అభిషేక పూజ కార్యక్రమాలు పూర్తిచేసి సామన్య భక్తులను దర్శనానికి అనుమతించారు.

Rama Rao

Rama Rao

Next Story