శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy: 50వ పాలకమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది- వైవీ సుబ్బారెడ్డి

Sandeep Eggoju
Published on: 19 Jun 2021 12:50 PM IST
TTD Chairman YV Subba Reddy Visited Tirumala Temple
X

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి (ఫైల్ ఇమేజ్)

YV Subba Reddy: తిరుమల శ్రీవారిని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. కరోనా అంతరించాలని, మానవాలి సుభిక్షంగా ఉండాలని సుందరకాండ పారాయణం, ధన్వంతరి మహా మంత్రాలను పఠనం చేస్తున్నామన్నారు. 50వ పాలకమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు వైవీ సుబ్బారెడ్డి. కోవిడ్‌ కారణంగా అనేక నిర్ణయాలు అమలుకాలేదన్న ఆయన.. గరుడవారధి ప్రాజెక్ట్‌ అలిపిరి వరకు నిర్మిస్తామని.. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు చేసి భక్తులందరికీ సంతృప్తికర దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను విజయవంతంగా బ్యాన్ చేశామని.. శ్రీవారి నైవేధ్యాలకు గోవు ఆధారిత ఎరువులతో సహజసిద్ధంగా పండించిన బియ్యం. తదితర ముడిసరుకులను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story