Tirumala: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఆన్‌లైన్‌లో ఏప్రిల్, మే నెలల వీఐపీ బ్రేక్ టికెట్లు

Tirumala: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 16 March 2024 11:16 AM IST
TTD Cancels VIP Break Darshan
X

Tirumala: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఆన్‌లైన్‌లో ఏప్రిల్, మే నెలల వీఐపీ బ్రేక్ టికెట్లు

Tirumala: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ తో వచ్చే వీఐపీలకు మాత్రమే వర్తించనున్నాయి. సామాన్య భక్తులకు వీఐపీ బ్రేక్ టికెట్లు ఇవ్వనున్నారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వీఐపీ బ్రేక్ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులోకి ఉంచనున్నారు. రోజుకు 2 వేల 500 టికెట్లను విడుదల చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన డెమో ను సైతం అధికారులు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story