TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు..

TTD Cancels Special Entry Darshan From SEP 27 TO AUG 5
x

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు..

Highlights

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులకు అనుమతి ఉంటుంది. తిరుమల శ్రీవారికి నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగి సెప్టంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు సర్వదర్శన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి.

సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకే కీలక నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబర్ 1వ తేదిన గరుడ వాహనం,5వ తేదిన చక్రస్నానం కార్యక్రమం. బ్రహ్మోత్సవాలు జరిగే తోమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసాం. అక్టోబర్ 1వ తేదీన గరుడసేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించం అన్నారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు రాత్రి 7 గంటలకు నిర్వహిస్తాం అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories