TTD: చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ కీలక పదవి..!

TTD Appoints Chaganti Koteswara Rao as Dharmic Advisor
x

TTD: చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ కీలక పదవి..!

Highlights

Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి కట్టబెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).

Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి కట్టబెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). చాగంటిని టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోనే చాగంటిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మప్రచారం కార్యక్రమాలను స్థానిక యువత భాగస్వామ్యంతో విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారని... వారి కోసం గత మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చాగంటిని సలహాదారుగా నియమించామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories