రద్దీ దృష్ట్యా ఆ ఐదురోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..

Tirumala: ఈనెల 11 నుంచి 15 వరకు వరుస సెలవుల కారణంగా టీటీడీ భక్తులకు ఓ విజ్ఞప్తి చేసింది.

Arun Chilukuri
Updated on: 9 Aug 2022 7:30 PM IST
TTD Appeal to Pilgrims due to Heavy Rush in Tirumala
X

రద్దీ దృష్ట్యా ఆ ఐదురోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..

Tirumala: ఈనెల 11 నుంచి 15 వరకు వరుస సెలవుల కారణంగా టీటీడీ భక్తులకు ఓ విజ్ఞప్తి చేసింది. సెలవుల నేపథ్యంలో తిరుమలకు తరలి వచ్చె భక్తులు ప్రణాళిక బద్దంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకొని రావాలని కోరింది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు వరుస సెలవులు ఆగస్టు 19 వరకు ఉన్నాయి. పైగా తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమలకు యాత్రీకుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story