TTD EO Dharmareddy: ఐదు విభాగాలుగా టీటీడీ అన్నదానం ట్రస్టు.. అనుభవం కలిగిన 33 మంది వంట సిబ్బందిని నియమిస్తాం

TTD EO Dharmareddy: అన్నదానంలో నాణ్యత పెంచుతాం

Shekhar G
Published on: 1 Sept 2023 3:46 PM IST
TTD Annadanam Trust In Five Divisions Says TTD EO Dharmareddy
X

TTD EO Dharmareddy: ఐదు విభాగాలుగా టీటీడీ అన్నదానం ట్రస్టు.. అనుభవం కలిగిన 33 మంది వంట సిబ్బందిని నియమిస్తాం

TTD EO Dharmareddy: అన్నదానం ట్రస్టుని ఐదు విభాగాలుగా విభజించి త్వరలోనే అన్నదానంలో అనుభవం కలిగిన 33 మంది వంట సిబ్బందిని నియమించనున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. అన్నదానంలో నాణ్యతని పెంచేందుకు ఇకపై మిల్లర్ల ద్వారా బియ్యాన్ని సేకరిస్తామని ఆ‍యన స్పష్టం చేశారు.. గడిచిన ఆగస్టు నెలలో 22 లక్షల 25 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. స్వామి వారి హుండీ ద్వారా 120 కోట్ల 5 లక్షల రూపాయల నగదు వచ్చిందన్నారు. 43 లక్షల 7 వేల మంది భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనంలో ప్రసాదాలు స్వీకరించారన్నారని తెలిపారాయన.

Shekhar G

Shekhar G

Next Story