త్వరలోనే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు తీసుకుంటా : రమణ దీక్షితులు

త్వరలోనే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు తీసుకుంటా : రమణ దీక్షితులు
x
Highlights

శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా త్వరలోనే బాధ్యతలు తీసుకుంటానంటున్నారు రమణ దీక్షితులు. తనతో పాటూ మిగిలిన వంశపారంపర్య అర్చకులకు యధాస్థానం తిరిగి...

శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా త్వరలోనే బాధ్యతలు తీసుకుంటానంటున్నారు రమణ దీక్షితులు. తనతో పాటూ మిగిలిన వంశపారంపర్య అర్చకులకు యధాస్థానం తిరిగి కేటాయిస్తామని టీటీడీ హామీ ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఆగమ సలహా మండలి సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు రమణ దీక్షితులు తెలిపారు. బ్రిటీష్ కాలం నుంచే తమ నాలుగు కుటుంబాలు అర్చకత్వం చేస్తూ శ్రీవారికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని 1987లో అప్పటి ప్రభుత్వం మిరాశీ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. మళ్లీ వైఎస్ వచ్చాక,ఆపై ఇప్పుడు జగన్ వచ్చాక తిరిగి తమ గౌరవం తమకు దక్కిందన్నారు. సీఎం జగన్ సుపరిపాలనకు ఫలితంగా రాష్ట్రం జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయన్నారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories