Dharma Reddy: డాలర్ శేషాద్రితో నాది వ్యక్తిగత అనుబంధం

Dharma Reddy: డాలర్ శేషాద్రిపై టీటీడీ అదనపు ఈవో స్పందన

Sandeep Eggoju
Updated on: 29 Nov 2021 3:40 PM IST
TTD Additional EO Dharma Reddy Reacts on Dollar Seshadri Death
X

డాలర్ శేషాద్రి మృతి పై స్పందించిన ధర్మ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Dharma Reddy: డాలర్ శేషాద్రితో తన అనుబంధం ఈనాటిది కాదన్నారు టీటీడీ అదపు ఈవో ధర్మారెడ్డి తనకెంతో ఇష్టమైన డాలర్లను ధరించమని ఆయనే తనకు ఇచ్చారని, ఈరోజుకి ఆ డాలర్ ను తాను ధరిస్తున్నానని ధర్మారెడ్డి అన్నారు. శ్రీవారి పూజా కైంకర్యాలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆలయ కైంకర్యాలపై శేషాద్రి స్వామి 5 పుస్తకాలు రాశారు.

వాటిలో రెండు ముద్రించామని మరో మూడు ముద్రణ దశలో ఉన్నాయ్ అనీ ధర్మారెడ్డి తెలిపారు. నిన్న వైజాగ్ లో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు పర్యవేక్షించిన డాలర్ శేషాద్రి రాత్రి పది గంటల వరకూ అదే పనిలో ఉన్నారన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు నలతగా ఉందన్నారని వేకువ జామున 4 గంటలకు శ్వాస అందడం లేదనడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యంలోనే వైకుంఠ ప్రాప్తి పొందారన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story