Tamilisai: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

Tamilisai: మొక్కులు చెల్లించుకుని గవర్నర్ ప్రత్యేక పూజలు

Dhatripriya
Published on: 10 May 2023 1:48 PM IST
TS Governer Tamilisai Visited Tirumala
X

Tamilisai: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేసారు. వీఐపీ బ్రేక్ సమయంలో మార్పు తీసుకురావడం చాలా మంచి నిర్ణయమన్నారామె.... సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి, దేవుడి ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో తనను ఆహ్వానించక పోవడం వల్లే హాజరు కాలేదని, దీనిపై కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు సరి కాదన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story