పులిచింతల ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకుంటున్న ఏపీ, తెలంగాణ పోలీసులు

బ్యారేజీలపై రాకపోకలు నిలిపివేసిన పోలీసులు పులిచింతల నుంచి కృష్ణా బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ అధికారులు...

Sandeep Reddy
Updated on: 1 July 2021 3:25 PM IST
పులిచింతల ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకుంటున్న ఏపీ, తెలంగాణ పోలీసులు
X

ఆంధ్ర తెలంగాణ వాటర్ వార్ 

AP TS Water Issue: ఏపీ- తెలంగాణ మధ్య జల వివాదం ఉద్రిక్తంగా మారింది. పులిచింతల ప్రాజెక్టు వద్దకు తెలంగాణ, ఏపీ పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య చినికి చినికి గాలి వానలా మారింది. బ్యారేజీలపై రాకపోకలు నిలిపివేశారు. పులిచింతల నుంచి కృష్ణా బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ అధికారులు జలవిద్యుత్‌కు నీటిని వినియోగించుకుని దిగువకు నీళ్లు వదులుతున్నారని... ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా పులిచింతల నుంచి నీటిని వాడేస్తోందన్న ఏపీ ఫిర్యాదు చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story