దయనియ స్థితుల్లో విశాఖ ఏజెన్సీ గిరిజన గ్రామాలు

దయనియ స్థితుల్లో విశాఖ ఏజెన్సీ గిరిజన గ్రామాలు
x
Highlights

తరాలు మారుతున్న,టెక్నాలజి పరుగులు పెడతున్నా వారి బ్రతుకులు మారడం లేదు. రోడ్డు సదుపాయం లేక సకాలంలో వైద్యం అందక మార్గమద్యలోనే ప్రాణాలు పోతున్నాయి. విశాఖ...

తరాలు మారుతున్న,టెక్నాలజి పరుగులు పెడతున్నా వారి బ్రతుకులు మారడం లేదు. రోడ్డు సదుపాయం లేక సకాలంలో వైద్యం అందక మార్గమద్యలోనే ప్రాణాలు పోతున్నాయి. విశాఖ ఏజెన్సీలో డోలీమోతలు మరణాలు పరిపాటిగా మారిపోతున్నాయి. నిత్యం అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్ఫోతున్న పాలకులు అటు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు లబోదిబోమంటున్నారు.

విశాఖ ఏజెన్సీలో గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శాస్త్రసాంకేతిక రంగాల్లో సమాజం దూసుకుపోతున్నప్పటికీ గిరిజన గ్రామాల్లో పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. సరైన వైద్య సదుపాయాలు, రోడ్లు, మంచినీటి వసతి సౌకర్యాలు లేక గిరిజనులు అల్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో రావికమత మండలం చీలమపాడు పంచాయతీ పరిధిలోని చల్లిసింగమ గ్రామంలో ఓ బాలింతను చికిత్స నిమిత్తం డోలీలో తరలించాల్సిన పరిస్థితి దాపురించింది. మరి కొన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేక వైద్యం అందక ఎందరో మృత్యువాత పడిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఏజెన్సీ పరిధిలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నా కనీస మౌళిక వసతులు కల్పించడం లేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియా అని చెప్తున్న పాలకులు రోడ్డు లేక నీరు లేక ప్రాణాలు గాలిలో కలిసిపోయని స్థానిక గిరాజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులు, తాగునీరు., వైద్య సౌకర్యాలు కల్పించాలని గిరిజన తండా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories