Andhra Pradesh: చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Andhra Pradesh: సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు, నారాయణ

Sandeep Eggoju
Published on: 19 March 2021 9:12 AM IST
Trials in Highcourt on Chandrababu Petition
X

చంద్రబాబు ఫైల్ ఫోటో

Andhra Pradesh: అసైన్డ్‌ భూముల వ్యవహారంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. సీఐడీ నోటీసులు అందుకున్న ఇరువురు నోటీసులను సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ వేశారు. రాజకీయ కక్షలో భాగంగా కేసులు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎస్సీ,ఎస్టీ కాకపోయినా అట్రాసిటీ కేసు పెట్టారని ఎఫ్‌ఐఆర్‌లో నేరం చేసినట్లు ఆధారాలు లేవన్నారు. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు ఇవ్వగా కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే ఆసక్తి నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story