Loco Pilot: విజయవాడ రైల్వేస్టేషన్‌లో లోకో పైలెట్‌ దారుణ హత్య

Railway loco Pilot Murder: విజయవాడ రైల్వేస్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Oct 2024 9:19 AM IST
Loco Pilot: విజయవాడ రైల్వేస్టేషన్‌లో లోకో పైలెట్‌ దారుణ హత్య
X

Loco Pilot: విజయవాడ రైల్వేస్టేషన్‌లో లోకో పైలెట్‌ దారుణ హత్య

Railway loco Pilot Murder: విజయవాడ రైల్వేస్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. లోకోపైలట్‌ డి.అబినేజర్‌ను రాత్రి రెండు గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. విధుల్లో ఉన్న లోకో పైలట్‌ తలపై నిందితుడు రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించిన కాసేపటికే మరణించాడు.

సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితుడు ఒంటిపై చొక్కా లేకుండా సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తోటి లోకోపైలట్ హత్యకు గురవ్వడంపై రైల్వే లోకో పైలట్ అసోసియేషన్ ఆందోళనకు దిగారు.

కాగా ఈ దారుణం గంజాయి బ్యాచ్‌ చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ సంఘటనతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. దక్షిణ మధ్య రైల్వే లోకో పైలట్ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. తమకు రక్షణ లేదని.. తరచూ గంజాయి బ్యాచ్‌ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story