Road Accident: మృత్యవు ముందు ఓడిపోయిన ప్రేమ జంట

Road Accident: ప్రేమ జంటను మృత్యువు కదిలించింది. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట మృత్యువును జయించలేకపోయింది.

Arun Chilukuri
Published on: 5 Dec 2025 12:18 PM IST
Road Accident: మృత్యవు ముందు ఓడిపోయిన ప్రేమ జంట
X

Road Accident: మృత్యవు ముందు ఓడిపోయిన ప్రేమ జంట

Road Accident: ప్రేమ జంటను మృత్యువు కదిలించింది. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట మృత్యువును జయించలేకపోయింది. మృత్యుముందు ప్రేమ ఓడిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చోటుచేసుకుంది.. ఏడాది క్రితం ప్రేమ వివాహంతో ఒక్కటైన జంటకు మూడు నెలల పాప ఉంది. ఆధార్‌ అప్డేట్ కోసం రాజానగరానికి భార్యభర్తలు స్కూటీపై వెళ్తున్నారు. అప్పుడే సిమెంట్ లోడుతో వెళ్తోన్న లారీ టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి స్కూటీని ఢీకొంది. ప్రమాదంలో భార్యాభర్తలు ప్రసాద్, సోనియా అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ ఒకేసారి మరణించడంతో నందరాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story