నెల్లూరు జిల్లాలో విషాదం

Sandeep Eggoju
Updated on: 30 Jan 2021 11:56 AM IST
Tragedy in Nellore District Padarupalli
X

Representational Image

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పడారుపల్లిలోని నందా లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే తాడుకు ఉరివేసుకుని ప్రేమికులు హరీష్‌, లావణ్య సూసైడ్‌ చేసుకున్నారు. మృతులు చిట్టమూరు మండలం మెట్టు గ్రామ సచివాలయం ఉద్యోగులుగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు రూరల్ మండలానికి చెందిన హరీష్ చిట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సచివాలయంలో నాయుడుపేటకు చెందిన లావణ్య వీఆర్వోగా పని చేస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విధులకు హాజరుకాలేదు. నెల్లూరు నగర శివారు ప్రాంతమైన పడారుపల్లి సమీపంలోని నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని సూసైడ్‌ చేసుకున్నారు.

రాత్రయినా హరీష్‌, లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి దాటాక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

మరోవైపు హరీష్‌, లావణ్య ఇప్పటికే వివాహం చేసుకున్నారని, అయితే ఆ విషయం తెలియని హరీష్‌ తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తుండడంతో.. ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story