విశాఖ జిల్లా జే.నాయుడుపాలెంలో విషాదం

Visakhapatnam: ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తల్లి ఆత్మహత్యాయత్నం.

Jyothi
Published on: 14 Feb 2022 12:02 PM IST
Tragedy in J. Naidupalem Visakhapatnam District
X

విశాఖ జిల్లా జే.నాయుడుపాలెంలో విషాదం

Visakhapatnam: విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న రోలుగుంట మండలం జే.నాయుడుపాలెంలో జరిగింది . కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో పాటు తల్లి బావిలో దూకింది. స్థానికులు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఐదేళ్ల బాలిక, మూడేళ్ల బాలుడు మృతి చెందారు. తల్లిని స్థానికులు కాపాడారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను వెలికితీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story