Krishna District: పుట్టిన రోజు వేడుకల్లో విషాదం

Krishna District: మద్యం తాగి అర్ధరాత్రి చెరువులో పడిన యువకుడు

R Tripura Malini
Updated on: 19 Dec 2022 1:18 PM IST
Tragedy In Birthday Celebrations
X

పుట్టిన రోజు వేడుకల్లో విషాదం

Krishna: కృష్ణా జిల్లా పెదవిరివాడలో ఓ యువకుడి పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న యువకుడు కృష్ణబాబు మద్యం మత్తులో చేపల చెరువులో పడడంతో దుర్మరణం చెందాడు. పెదివిరివాడకు చెందిన యువకుడు వెంకటనాగు పుట్టినరోజు వేడుక సందర్భంగా అర్ధరాత్రి స్నేహితులతో కలిసి చేపల చెరువుపై దావత్ చేసుకున్నారు. అక్కడ మద్యం తాగిన మైకంలో చెరువులో దిగడంతో మృతి చెందాడు. కృష్ణబాబు మృతదేహం చేపల చెరువులో లభ్యమయింది. అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.

R Tripura Malini

R Tripura Malini

Next Story