అనంతపురం జిల్లాలో విషాదం

Anantapur: అగ్రహారంలో మూడు నెలల చిన్నారికి ఉరివేసి.. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి.

Jyothi
Published on: 13 Feb 2022 11:11 AM IST
Tragedy In Anantapur District
X

అనంతపురం జిల్లాలో విషాదం

Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం అగ్రహారం శివారులో మూడు నెలల చిన్నారికి ఉరివేసి.. అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతురాలు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తల్లి కూతురు మృతి చెందడంతో అగ్రహారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలే ఆత్మహత్యలకు కారణం అని ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది.

Jyothi

Jyothi

Next Story