Bapatla: బాపట్ల జిల్లాలో విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్‌ దగ్ధం

Bapatla: వరిలోడ్‌తో వెళ్తుండగా తీగలు తగిలి అంటుకున్న మంటలు

Dhatripriya
Published on: 16 April 2023 2:55 PM IST
Tractor Caught Fire In Bapatla By Hitting Current Wires
X

Bapatla: బాపట్ల జిల్లాలో విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్‌ దగ్ధం

Bapatla: విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్ దగ్ధమైన ఘటన బాపట్ల జిల్లా పూసపాడులో చోటుచేసుకుంది. పూసపాడు గ్రామంలోని సంతబజార్‌లో విద్యుత్ వైర్లు వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌కు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రాక్‌, గడ్డి కాలిపోగా... డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సుమారు 2 లక్ష మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ట్రాక్టర్ యాజమాని తెలిపారు. విద్యుత్ తీగలను సరి చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని.. విద్యుత్ తీగలు వేలాడటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story