తిరుపతిలో అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం

* తిరుపతి నుంచి ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు అదృశ్యం

R Tripura Malini
Published on: 13 Nov 2022 3:47 PM IST
Trace of missing students from Tirupati
X

తిరుపతిలో అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం 

Tirupati: తిరుపతిలో తీవ్ర కలకలం సృష్టించిన విద్యార్థుల మిస్సింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. తప్పిపోయినవారి ఆచూకీని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కనుగొన్నారు. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు తిరుపతి నుంచి ఆగ్రాకు వెళ్లినట్లు తెలిసింది. అయితే వారు ఆగ్రాకు ఎందుకు వెళ్లారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story