అనకాపల్లిలో గ్యాస్ లీకేజీ.. మహిళలకు అస్వస్థత..
Atchutapuram: పోరస్ కంపెనీ నుంచి లీకైన అమ్మోనియా
అనకాపల్లిలో గ్యాస్ లీకేజీ.. మహిళలకు అస్వస్థత
Gas Leak: అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్ పరిధిలోని పోరస్ కంపెనీలో గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో సమీపంలోని సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాయువు పీల్చడంతో మహిళలకు తల తిరగడం, కళ్ల మంటలు రావడంతో పాటు వాంతులు అయ్యాయి. పదుల సంఖ్యలో మహిళలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రవి సుభాష్.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అదికారులు విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను అచ్యుతాపురం,యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు.
Next Story




