విషాదం : విశాఖ జిల్లా అరకు లోయలో పడ్డ బస్సు..8 మంది మృతి

Arun Chilukuri
Updated on: 12 Feb 2021 8:56 PM IST
విషాదం : విశాఖ జిల్లా అరకు లోయలో పడ్డ బస్సు..8 మంది మృతి
X

విషాదం : విశాఖ జిల్లా అరకు వద్ద లోయలో పడ్డ బస్సు..8 మంది మృతి

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం సంభవించింది. అనంతగిరి మండలం డముకలో ఐదో నెంబర్ మలుపు దగ్గర మినీ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో హైదరాబాద్ నుంచి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లిన 8 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను ఎస్.కోట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story