Tomato Price: ఏపీలో కొండెక్కిన టమోటా ధర.. సబ్సిడీపై టమోటా అందిస్తున్న ఏపీ ప్రభుత్వం

Tomato Price: బహిరంగ మార్కెట్ లో రూ.100 పలుకుతున్న టమోటా

Shekhar G
Published on: 1 July 2023 12:05 PM IST
Tomato price Hiked In AP Government Is Providing Tomato On Subsidy
X

Tomato Price: ఏపీలో కొండెక్కిన టమోటా ధర.. సబ్సిడీపై టమోటా అందిస్తున్న ఏపీ ప్రభుత్వం

Tomato Price: ఏపీలో కూరగాయల ధరలు కొండెక్కాయి. ముఖ్యంగా టమోటా ధరలు భారీగా పెరిగాయి.. ఏకంగా కేజీ 100 వంద రూపాయల వరకూ పలుకుతోంది. ఈ క్రమంలో ఈ ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. టమోటా పంటను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతుబజార్లలో కిలో 50 రూపాయలకే అందుబాటులో ఉంచుతోంది.

ప్రతి రోజూ 50 నుంచి 60 టన్నుల టమోటాను సేకరించాలని నిర్ణయించారు. సీఎం యాప్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టమోటా మాత్రమే కాదు పచ్చి మిర్చి ధరలు కూడా భారీగా పెరగడంతో.. వాటిని కూడా సబ్సిడీపై అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు.

నాలుగేళ్లుగా టమోటా ధరలు పెరిగిన పలు సందర్భాల్లోనూ రాష్ట్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా పచ్చి మిర్చి కూడా పలు జిల్లాల్లో .వంద రూపాయలు దాటినట్టు గుర్తించారు. దీంతో మంత్రి ఆదేశాలతో పచ్చి మిర్చిని కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్టు చేస్తున్నారు. టమాటాలను సబ్సిడీపై అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టామని.. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story