కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో పడిపోయిన టమోట ధర

* ధర లేక టమోటాలు మార్కెట్లోనే కిందపడేసి వెళ్తున్న రైతన్నలు * రైతులతో మాట్లాడిన సీపీఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య * రైతు భరోసా అంటే ఏంటో సీఎం జగన్‌ చెప్పాలి-సీపీఐ నేతలు

admin
Published on: 25 Dec 2020 10:56 AM IST
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో పడిపోయిన టమోట ధర
X

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోట ధర పాతాళానికి పడిపోయింది. మార్కెట్లో కొనే నాథుడు లేక రైతులు టమోటాలు కిందపడేసి వెళ్తున్నారు. దీంతో పారవేసిన టమోటాలు పశువులకు మేతగా మారాయి. విషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, జగన్నాథం మార్కెట్లో తిరుగుతూ రైతులతో మాట్లాడారు. ఇక రైతు భరోసా అంటే ఏంటో సీఎం జగన్‌ చెప్పాలంటూ నిలదీశారు.

admin

admin

Next Story