Perni Nani: మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ ప్రముఖుల భేటి

Perni Nani: ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాల ప్రక్రియ మరింత ముందుకు తీసుకువెళ్లేలా చర్చ

Sandeep Eggoju
Updated on: 29 Oct 2021 3:52 PM IST
Perni Nani: మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ ప్రముఖుల భేటి
X

Perni Nani: ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాల ప్రక్రియ మరింత ముందుకు తీసుకువెళ్లేలా మంత్రితో చర్చించారు. మంత్రి నానీతో సమావేశమైన వారిలో దిల్‌ రాజు, బన్నీవాసు, వంశీ, అలంకార్‌ ప్రసాద్‌ ఉన్నారు. కోవిడ్ సమయంలో సినిమా థియేటర్లకు విద్యుత్ ఫిక్సడ్ ఛార్జీల వెసులుబాటు అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు టాలీవుడ్‌ ప్రముఖులు. నిన్న సీఎం జగన్‌తో నటుడు నాగార్జున సమావేశమైన విషయం తెలిసిందే.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story