Jonnavithula: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. టాలీవుడ్ రచయిత జొన్నవిత్తుల ప్రకటన..

Jonnavithula Ramalingeswara Rao: ఏపీలో ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 20 Jun 2023 4:22 PM IST
Tollywood Lyricist Jonnavithula Ramalingeswara Rao Announces Jai Telugu Party in AP
X

Jonnavithula: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పార్టీగా..

Jonnavithula Ramalingeswara Rao: ఏపీలో ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. అధికార వైసీపీ సింగిల్ గా, విపక్ష పార్టీలు పొత్తులతో పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని విపక్ష పార్టీలు ఒంటరిగా పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో కొత్తగా పలు రాజకీయ పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి. టాలీవుడ్ సీనియర్ రచయిత జొన్నవిత్తుల రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టాలీవుడ్ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు.

ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని విధంగా భాషా ప్రాతిపదికన ఈ రాజకీయ పార్టీ ప్రకటించారు. దీని పేరును జై తెలుగు పార్టీగా వెల్లడించారు. త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నాయకులు, ప్రజలను చైతన్యవంతం చేసేందుకే తాను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. తెలుగు భాషకు పునర్ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాజకీయ పార్టీ పని చేయబోతోందన్నారు. తెలుగు భాష అజెండాగా వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు జొన్నవిత్తుల పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story