Kurnool: ఓటర్ లిస్ట్‌లో హీరో వెంకటేష్‌ ఫొటో

తప్పును సరిదిద్ది, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశం

Venkata Chari
Published on: 19 Feb 2021 7:06 PM IST
Tollywood Hero Daggubati Venkatesh Photo on Kallur Voter List
X

హీరో వెంకటేష్ ఫైల్ ఫొటో


కర్నూలు జిల్లా కల్లూరు వార్డులోని ఓటర్ లిస్టులో ప్రముఖ టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ ఫొటో ఉండడం కలకలం రేపింది. ఈవిషయంపై ఆ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తీవ్రంగా మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల హడావిడి కనసాగుతోంది. ఇప్పటికే మూడు దశల ఎన్నికల పోలింగ్ పూర్తైంది. ఇక చివరి విడత పోలింగ్‌ కోసం అధికారులు కుస్తీలు పడుతున్నారు. ఓటర్ లిస్టులో తాజాగా, చిన్న పొరపాటు దొర్లింది. జిల్లాలోని కల్లూరు పరిధిలోని 31వ వార్డు ఓటరు జాబితాలో హీరో వెంకటేష్ ఫొటో ఉండటం కలకలం రేపింది. కార్డులో వివరాలు మాత్రం ఓ మహిళకు సంబంధించినవిగా ఉన్నాయి.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్ అధికారులపై సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీవో, కల్లూరు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక 31 వార్డు ఓటరు లిస్టు ఇంచార్జ్ బీఎల్‌వోపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే తప్పును సరిదిద్దాలని ఆదేశించారు.

Venkata Chari

Venkata Chari

Next Story