ఇవాళ సీఎం జగన్‌‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

CM Jagan: హాజరుకానున్న చిరంజీవి, నాగార్జున, దర్శకులు, నిర్మాతలు. కమిటీ నివేదికపై సీఎంతో చర్చించిన మంత్రి పేర్ని నాని.

Sriveni Erugu
Published on: 10 Feb 2022 7:55 AM IST
Tollywood Celebrities Meet CM Jagan Today
X

ఇవాళ సీఎం జగన్‌‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

CM Jagan: సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై ఏపీ సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సీఎంతో భేటీ అవుతారు. జగన్ తో జరిగే సమావేశంలో చిరంజీవి, నాగార్జున, దర్శకులు, నిర్మాతలు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. సినిమా టికెట్ ధరలపై వేసిన కమిటీ నివేదికపై మంత్రి చర్చించారు. సినీ సమస్యలపై సినీ పెద్దలు సీఎంతో మాట్లాడుతారని పేర్ని నాని వెల్లడించారు. కరోనా ఆంక్షల వల్ల తక్కువ మందే రావాలని కోరినట్లు చెప్పారు.

సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఏసీ థియేటర్లలో కనీస ధర 40 రూపాయల నుంచి గరిష్ట ధర 150 రూపాయలుగా ఉండాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎయిర్ కూల్ థియేటర్లకు కనీస ధర 40 రూపాయల నుంచి 120 రూపాయలు ఉండాలని కమిటీ సూచించింది. నాన్ ఏసీ థియేటర్లలో కనీస ధర 30 రూపాయల నుంచి గరిష్ట ధర 70 రూపాయలు ఉండాలని కమిటీ పేర్కొంది. కమిటీ నివేదికపై గురువారం సినీ ప్రముఖులతో సీఎం చర్చించనున్నారు. మరోవైపు సినిమా టికెట్ ధరలపై గురువారం హైకోర్టు డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టనుంది

Sriveni Erugu

Sriveni Erugu

Next Story