నేడు విశాఖకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి

* విశాఖలో పర్యటించనున్న కేంద్రమంత్రి ఫగన్ సింగ్ పర్యటన

Dhatripriya
Published on: 13 April 2023 8:18 AM IST
Today Union Minister of Steel Visit To Visakhapatnam
X

నేడు విశాఖకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం కొంతకాలంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై ప్రతిపక్ష, వివక్ష పార్టీలు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ప్రైవేటీకరణ వ్యవహారంపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఇక స్టీల్ ప్లాంట్‌ను టేకోవర్ చేసుకునేందుకు కూడా రెడీ అయ్యారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. సింగరేణి సీఎండీతో సమావేశమయ్యారు. ఈ సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్... స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశం కానున్నారు.

ఇవాళ ఫగన్ సింగ్ కులస్తీ విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమై.. తాజా పరిస్టితులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా ఫగన్ సింగ్ ఆహ్వానించారు. ఈ మేరకు కులస్తీ రాక, సమావేశం కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే తెలంగాణ సింగరేణి నుంచి ముగ్గురు డైరెక్టర్లు వెళ్లిన సమయంలోనే ఫగన్ సింగ్ కులస్తీ విశాఖ పర్యటనకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Dhatripriya

Dhatripriya

Next Story