Andhra Pradesh: నేడు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Andhra Pradesh: రథసప్తమి సందర్భంగా అంతర్వేదిలో పర్యటించనున్న సీఎం

Sandeep Eggoju
Updated on: 19 Feb 2021 9:22 AM IST
Today CM Jagan Tour in East Godavari District
X

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. రథసప్తమి సందర్భంగా అంతర్వేదిలో పర్యటించి లక్ష్మీనరసింహ స్వామి, అమ్మవార్లను ఆయన దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్‌లో అంతర్వేదికి చేరుకోనున్న జగన్‌ రోడ్డుమార్గంలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం లక్ష్మీనరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు సీఎం జగన్. అనంతరం స్వామివారి నూతన రథాన్ని పరిశీలించి ప్రారంభించనున్నారు. 95 లక్షల ఖర్చుతో 40 అడుగుల ఎత్తు, 7 అంతస్థులతో స్వామివారి నూతన రథాన్ని ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. రికార్డు స్థాయిలో 3 నెలల కాలంలోనే రథం నిర్మాణం చేపట్టారు. ఇక సీఎం జగన్‌ పర్యటనతో జిల్లా అధికార యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story