Kurnool: ఇవాళ కర్నూలులో చంద్రబాబు పర్యటన

Kurnool: రోడ్‌ షోలో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు

Sandeep Eggoju
Updated on: 4 March 2021 1:01 PM IST
Today Chandrababu Tour in Kurnool district
X

చంద్రబాబు రోడ్ షో (ఫైల్ ఇమేజ్)

Kurnool: కర్నూలులో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ, ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్నూలులో పట్టు సాధించటమే లక్ష్యంగా పార్టీలు ప్రచార వ్యూహంలో దూసుకుపోతున్నాయి. ఈ ఎన్నికలు టీడీపీకి ఓ సవాల్‌గా మారడంతో అగ్రనేతలే ప్రచార రంగంలోకి దిగుతున్నారు.

దాదాపు 15 ఏళ్ల తర్వాత కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో గెలుపు కోసం టీడీపీ అగ్రనేతలు ప్రచారం బరిలోకి దిగుతున్నారు. ఎలాగైనా విజయం సాధించి.. పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకోసం నేరుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు క్యాంపెయిన్‌ చేసేందుకు నడుం బిగించారు.

ఇవాళ కర్నూలులో చంద్రబాబు పర్యటించనున్నారు. పలుచోట్ల రోడ్డు షో ల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బాబు ప్రచారంతో టీడీపీ అభ్యర్థులకు కొత్త బలం వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక.. కర్నూలులోని పాత బస్టాండ్, ఆర్ ఎస్ రోడ్డు, మోర్య ఇన్, బళ్లారి చౌరస్తా, కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో చంద్రబాబు రోడ్‌ షో సాగనుంది. అవసరమైన దగ్గర చంద్రబాబు ప్రసంగిస్తారని టీడీపీ నేతలు తెలిపారు. మొత్తానికి కర్నూలులో చంద్రబాబు పర్యటనతో రాజకీయాలు ఊపందుకున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story